ఆధార్ కార్డు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది.
ఈ అంశంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఆధార్ కార్డుకు సంబంధించి ప్రజలపై ఒత్తిడి తేవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. సామాజిక, భద్రతా పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కోర్టు స్పష్టం చేసింది.
గతంలో ఇదే తరహా ఆదేశాలను సుప్రీం ఇచ్చినా..వాటిని ప్రభుత్వాలు పక్కకు పెట్టి ప్రతి పథకానికీ ఆధార్‌ను అనుసంధానించిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment