.
Wednesday, 18 March 2015
Tuesday, 17 March 2015
ఇక ఆధార్ తప్పనిసరి కాదు : సుప్రీం కోర్టు ...
ఆధార్ కార్డు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది.
ఈ అంశంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఆధార్ కార్డుకు సంబంధించి ప్రజలపై ఒత్తిడి తేవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. సామాజిక, భద్రతా పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కోర్టు స్పష్టం చేసింది.
గతంలో ఇదే తరహా ఆదేశాలను సుప్రీం ఇచ్చినా..వాటిని ప్రభుత్వాలు పక్కకు పెట్టి ప్రతి పథకానికీ ఆధార్‌ను అనుసంధానించిన సంగతి తెలిసిందే.
Monday, 16 March 2015
బ్లాగర్లకు నమస్కారము
బ్లాగర్లకు నమస్కారము....
నా పేరు అజయ్. నేను కర్నూలు వాసిని. వృత్తిరీత్యా డిజైనర్‌ను. ఈ రోజు నుండి నేను కూడా ఒక బ్లాగ్ ఏర్పాటు చేసుకోవాలని ఈ ప్రయత్నం. నా అభిప్రాయాలను, నాకు నచ్చిన విషయాలను, నేను స్పందించే విషయాలను ఈ బ్లాగ్‌లో సంక్షిప్తంగా రాస్తాను. దయచేసి బ్లాగర్ మిత్రులు తమ సహాయ సహకారాలు అందివ్వాల్సిందిగా కోరుతున్నాను. నా అభిప్రాయాలతో విభేదించేవారు సైతం వారి అభిప్రాయాలను, సూచనలను తెలియజేయవచ్చు.... దయచేసి మీ విలువైన సూచనలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.... మీ అజయ్ ...

Subscribe to:
Posts (Atom)